Harichandana Dasari: నైపుణ్యాభివృద్ధికి న్యాక్‌కు ప్లాటినం అవార్డు
ABN , Publish Date - Jun 15 , 2025 | 03:41 AM
నిర్మాణ రంగంలో ఉత్తమ నైపుణ్యాభివృద్ధికి గాను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్)కి ప్లాటినం అవార్డు లభించింది. న్యాక్ డైరెక్టర్ జనరల్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన హరిచందన దాసరికి ప్రభుత్వ సేవల్లో గోల్డ్ అవార్డు దక్కింది.
ప్రభుత్వ సేవల్లో హరిచందనకు గోల్డ్ అవార్డు
నిర్మాణ రంగంలో ఉత్తమ నైపుణ్యాభివృద్ధికి గాను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్)కి ప్లాటినం అవార్డు లభించింది. న్యాక్ డైరెక్టర్ జనరల్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన హరిచందన దాసరికి ప్రభుత్వ సేవల్లో గోల్డ్ అవార్డు దక్కింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ డెవల్‌పమెంట్ అకాడమీ ఈ అవార్డులను ఢిల్లీలో శనివారం అందజేసింది. నిరుద్యోగ యువతకు, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు వివిధ నిర్మాణ రంగ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడంలో న్యాక్ కీలక పాత్ర పోషించింది.
అందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 24,346 మందికి ఉచిత శిక్షణ, ఉచిత భోజనం, వసతి వంటి సౌకర్యాలను కల్పించింది. పీఎంకేవీవై, ప్రధాన్ మంత్రి విశ్వకర్మ పథకం కింద నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఈ సేవలను గుర్తించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ డెవల్‌పమెంట్ అకాడమీ అవార్డులకు ఎంపిక చేసింది. పురస్కారాలు పొందిన హరిచందన, న్యాక్ డైరెక్టర్లు, సిబ్బందిని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, న్యాక్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు.