Share News

నా ఫోన్‌నూ ట్యాప్‌ చేసి ఉండొచ్చు?: లక్ష్మణ్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:55 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన ఫోన్‌ను సైతం ట్యాపింగ్‌ చేసి ఉండొచ్చని ఎంపీ కే లక్ష్మణ్‌ అనుమానం వ్యక్తం చేశారు.

నా ఫోన్‌నూ ట్యాప్‌ చేసి ఉండొచ్చు?: లక్ష్మణ్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన ఫోన్‌ను సైతం ట్యాపింగ్‌ చేసి ఉండొచ్చని ఎంపీ కే లక్ష్మణ్‌ అనుమానం వ్యక్తం చేశారు., అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌, ఈ ఫార్ములా రేస్‌ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తే వాస్తవాలు బయటకొస్తాయని కె.లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను వెనక్కి ఇవ్వాలని అడగడం వెనక పెద్ద కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు. ఆ భూములను అమ్మేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను ఆపాలని, లేనిపక్షంలో అడ్డుకుంటామని హెచ్చరించారు.


స్థానిక సంస్థల ఎన్నికలను కాలయాపన చేయాలని చూడడం సరికాదని, హైకోర్టు తీర్పుతోనైనా ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సూచించారు. కాగా, అవినీతి పుట్టిందే కాంగ్రెస్‌ పార్టీలో అని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావ హైదరాబాద్‌లో తీవ్రంగా విమర్శించారు. అవినీతి అన్నది ఆ పార్టీ సిద్ధాంతమని, ఇందిరా గాంధీ హయాం నుంచి యూపీయే పాలన వరకూ అన్నీ కుంభకోణాలే అని మండిపడ్డారు. .

Updated Date - Jun 26 , 2025 | 04:55 AM