మెరుగైన విద్యకు ‘ప్యూర్’తో ఒప్పందం
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:07 AM
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్(ప్యూర్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

హైదరాబాద్, జనవరి17 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్(ప్యూర్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఈ ఒప్పందం జరిగింది. సంస్థ కార్యదర్శి బి. సైదులు, ప్యూర్ సీఈవో డా. శైలా తల్లూరి ఎంఓయూపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి అవసరమైన కార్యాచరణకు మార్గాన్ని సృష్టిస్తుంది. ముఖ్య లక్ష్యాలలో అధునాతన సాంకేతికత, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణను అందించడం, డిజిటల్ ల్యాబ్‌లు, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం, విద్యార్థుల్లో నాయకత్వం, బృంద చైతన్యం, సామాజిక సేవల్ని ప్రోత్సహించడానికి ప్యూర్ యువజన క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులకు పరిశ్రమల సందర్శనలు, వారి భవిష్యత్తుకు మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహిస్తారు.