Share News

గంజాయి వ్యాపారంటూ ప్రచారం చేశాడని..!

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:06 AM

క్షణికావేశం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొనగా.. ముగ్గురు యువకుల జీవితాన్ని జైలుపాలు చేసింది. యాప్రాల్‌లోని భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన పుల్లూరి వెంకట నర్సయ్య రెండో కుమారుడు ప్రణీత్‌ (21) డ్రైవర్‌గా పని చేస్తుంటాడు.

గంజాయి వ్యాపారంటూ ప్రచారం చేశాడని..!

  • స్నేహితుల దాడి.. యువకుడి మృతి.. ముగ్గురు జైలుపాలు

బిట్స్‌పిలానీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొనగా.. ముగ్గురు యువకుల జీవితాన్ని జైలుపాలు చేసింది. యాప్రాల్‌లోని భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన పుల్లూరి వెంకట నర్సయ్య రెండో కుమారుడు ప్రణీత్‌ (21) డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ప్రణీత్‌, అదే కాలనీకి చెందిన గోవర్ధన్‌ (27) స్నేహితులు. అయితే, గోవర్ధన్‌ గంజాయి విక్రయిస్తుంటాడని తెలిసిన వారి దగ్గర చెబుతూ ప్రణీత్‌ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని గోవర్ధన్‌ అతనిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన జోలికి రావొద్దని ప్రణీత్‌ను హెచ్చరించాలని గోవర్ధన్‌ నిర్ణయించుకున్నాడు.


ఇందులో భాగంగా ఏప్రిల్‌ 5వ తేదీ రాత్రి తొమ్మిది గంటలప్పుడు.. గోవర్ధన్‌, జశ్వంత్‌(20), విన్సెంట్‌(19) అనే స్నేహితులతో కలిసి మాట్లాడేపని ఉందని చెప్పి ప్రణీత్‌ను తమ వద్దకు పిలిచారు. నలుగురూ కలిసి ద్విచక్రవాహనాలపై సమీపంలోని క్రీడామైదానానికి వెళ్లి అక్కడ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ప్రణీత్‌ను కర్రలతో విచక్షణారహితంగా కొట్టి గాయపరిచి పరారయ్యారు. దీనిపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రణీత్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజుల చికిత్స అనంతరం మంగళవారం ఉదయం ప్రణీత్‌ మరణించాడు. ఇక, నిందితులైన గోవర్ధన్‌, జశ్వంత్‌, విన్సెంట్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Apr 09 , 2025 | 05:06 AM