Tummala Nageswara Rao Initiatives: వలసదారులకు మద్దతుగా సహాయ కేంద్రం
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:24 AM
రాష్ట్రంలోని వ లసదారులు, వారి కుటుంబాల సంక్షేమం, జీవనోపాధి అవకాశాలు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వ లసదారులు, వారి కుటుంబాల సంక్షేమం, జీవనోపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు మొబైల్ వలస సహాయ కేంద్రాలు దోహదం చేస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ వలస సంస్థ , ఆహార, వ్యవసాయ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అందుబాటులోకి తెచ్చిన మొబైల్ వలస సహాయ కేంద్రం వాహనాలను మంత్రి తుమ్మల హైదరాబాద్‌లో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో వలస వెళ్లే గ్రామీణ కుటుంబాలకు.. వలసకు ముందు, వలస సమయంలో, తిరిగి వచ్చిన తర్వాత అవసరమైన సమాచారం, సేవలను ఈ వాహనాలు అందిస్తాయని చెప్పారు. అయితే, ఎంపిక చేసిన ప్రాంతాల్లోని రైతులకు ఈ వాహనాల ద్వారా మట్టి పరీక్షలు, సేంద్రీయ వ్యవసాయం, పశుపోషణపై వర్చువల్ శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News