Share News

Timmapur: ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ తో సమస్యలు పరిష్కరిస్తా

ABN , Publish Date - May 02 , 2025 | 06:00 AM

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో 'ఎమ్మెల్యే ఆన్ వీల్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు ప్రతి వారంలో 3 రోజుల పాటు అధికారులతో ప్రజల వద్దకు వెళ్ళిపోతానని తెలిపారు.

Timmapur: ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ తో సమస్యలు పరిష్కరిస్తా

వారంలో 3 రోజులు ప్రజల వద్దకు: ఎమ్మెల్యే కవ్వంపల్లి

తిమ్మాపూర్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రజా జీవితంలో ఉన్నంత కాలం ప్రజా సేవకు పాటుపడుతూనే ఉంటానని మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌లో ఆయన ‘ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు రాత్రీ పగలు తేడా లేకుండా తన క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి తనను కలచి వేసిందని అన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించానని తెలిపారు. వారానికి 3 రోజులపాటు అధికారుల బృందంతో ప్రజల వద్దకు వెళతామని, అధికారుల సమక్షంలోనే ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తామని వెల్లడించారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు.. అవసరమైతే మంత్రు లు, సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ యాప్‌ ద్వారా వచ్చిన సమస్యలను చూసేందుకు రోజూ రెండు గంటలు కేటాయిస్తానని చెప్పారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సత్యనారాయణ.. వాహనంలో అధికారులతో కూర్చొని కొంత మంది ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 06:00 AM