Uttam Kumar Reddy: హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్
ABN , Publish Date - Dec 30 , 2025 | 09:52 PM
సాగునీటి అంశంపై హరీశ్ రావు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై జనవరి 5న సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు.
సాగునీటి అంశంపై హరీశ్ రావు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై జనవరి 5న సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు కేసు ఉందని, కోర్టు నెం.1, అంశం నెం.11గా లిస్టింగ్ అయిందని పేర్కొన్నారు (Uttam Kumar Reddy counter).
పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం చేస్తోందని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని మంత్రి ఉత్తమ్ అన్నారు (Congress vs BRS). కాగా, పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు విషయంలలో ఏపీపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఇవి కూడా చదవండి..
బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో నాలుగో పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..