Share News

Tummala Nageswara Rao: 2 విడతల్లో చేనేత అభయహస్తం

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:02 AM

తెలంగాణలో చేనేత కార్మికుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ‘చేనేత అభయహస్తం’ పథకం ఏడాదిలో రెండు విడతలుగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా చేనేత కార్మికులకు ఏటా ₹18,000, అనుబంధ కార్మికులకు ₹6,000 ప్రోత్సాహకాన్ని నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తారు.

Tummala Nageswara Rao: 2 విడతల్లో చేనేత అభయహస్తం

40 వేల మంది కార్మికులకు ప్రయోజనం

తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రత్యేక లోగో: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన ‘తెలంగాణ చేనేత అభయ హస్తం’ పథకం రెండు (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌, అక్టోబర్‌ నుంచి మార్చి వరకు) విడతల్లో అమలు చేస్తామని చేనేత కార్మికశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ‘తెలంగాణ చేనేత అభయహస్తం’ పథకం మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. వేతన ప్రోత్సాహం కింద ఏటా రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6,000 చెలిస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. ఒక్కో విడతలో చేనేత కార్మికుడికి రూ.9,000, అనుబంధ కార్మికుడికి రూ.3,000 సంబంధిత లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. ఈ పథకంతో సుమారు 40 వేల మంది చేనేత, అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని తుమ్మల వెల్లడించారు. ఇక రాష్ట్ర చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా ‘యూనిక్‌ లోగో’ జత చేస్తామని, తద్వారా ఆ వస్త్రాల నాణ్యతా ప్రమాణాలు, నేత కార్మికుడి వివరాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. 18 ఏళ్లు నిండడంతోపాటు జియో ట్యాగ్‌ చేసిన మరమగ్గాలపై పని చేసే కార్మికులతోపాటు ప్రీలూమ్‌, ప్రిపరేటరీ (డైయింగ్‌, టైయింగ్‌, డిజైనింగ్‌, వార్పింగ్‌, వైడింగ్‌, సైజింగ్‌) అనుబంధ పనులు చేసే వారితోపాటు చేనేత వృత్తితో వార్షికాదాయం 50 శాతం పొందుతున్న వారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:03 AM