Share News

Medaram: తెలంగాణ ట్రైబల్‌ డిజైన్‌ ప్లాన్లతో మేడారం శాశ్వత అభివృద్ధి పనులు: సీతక్క

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:38 AM

తెలంగాణ ట్రైబల్‌ డిజైన్‌ ప్లాన్లతో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు రూపకల్పన చేసినట్లు మంత్రి దనసరి సీతక్క తెలిపారు.

Medaram: తెలంగాణ ట్రైబల్‌ డిజైన్‌ ప్లాన్లతో మేడారం శాశ్వత అభివృద్ధి పనులు: సీతక్క

ములుగు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ట్రైబల్‌ డిజైన్‌ ప్లాన్లతో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు రూపకల్పన చేసినట్లు మంత్రి దనసరి సీతక్క తెలిపారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని ఐటీడీఏ అతిఽథిగృహంలో మంత్రి సీతక్క జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మేడారంలో అభివృద్ధి పనులను త్వరిత గతిన చేపట్టాలని అధికారులకు సూచించారు. జాతరలోపు మొదటి విడుత పనులు పూర్తి చేయాలన్నారు. వివిధ పనులు, నిర్మాణాలు చేపట్టేందుకు త్వరితగతిన టెండర్లు పూర్తి చేయాలని చెప్పారు.

Updated Date - Aug 30 , 2025 | 01:38 AM