Share News

మంత్రితో ముఖాముఖి నేడు మళ్లీ ప్రారంభం

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:51 AM

గాంధీ భవన్‌లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. టీపీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్‌ పట్టుదలతో ఈ కార్యక్రమం పునరుద్ధరించబడింది.

మంత్రితో ముఖాముఖి నేడు మళ్లీ ప్రారంభం

గాంధీభవన్‌లో వినతులు తీసుకోనున్న పొన్నం

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): గాంధీ భవన్‌లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌, పార్టీ నేతలు.. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్నారు. టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌ కుమార్‌గౌడ్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొద్ది రోజులు సజావుగానే సాగినా ఆ తర్వాత అటకెక్కింది. మధ్యలో రెండుసార్లు ప్రారంభించినా.. వివిధ కారణాలతో నిలిపేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ పట్టుదలతో మళ్లీ మంత్రితో ముఖాముఖి కార్యక్రమం పట్టాలెక్కింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 04:51 AM