Share News

Adloori Lakshman: సంక్షేమ హాస్టళ్లలో స్టీల్‌ పాత్రల్లోనే వండాలి

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:55 AM

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో అల్యూమినియం పాత్రలకు బదులు స్టీల్‌ పాత్రల్లో వంటలు వండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ఆదేశించారు.

Adloori Lakshman: సంక్షేమ హాస్టళ్లలో స్టీల్‌ పాత్రల్లోనే వండాలి

  • అల్యూమినియం పాత్రలు వాడొద్దు

  • విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు తనిఖీలు చేస్తా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

  • డబ్ల్యూడబ్ల్యూఎ్‌ఫతో కలిసి ‘మిషన్‌ ప్రకృతి’కి రాష్ట్ర గురుకులాలు శ్రీకారం

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో అల్యూమినియం పాత్రలకు బదులు స్టీల్‌ పాత్రల్లో వంటలు వండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ఆదేశించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు హాస్టళ్లను తనిఖీ చేస్తానని చెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ.. వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఇండియాతో కలిసి పర్యావరణ పరిరక్షణకు ‘మిషన్‌ ప్రకృతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.


ఈ మేరకు ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడారు. పీహెచ్‌సీ వైద్య బృందం 15 రోజులకోసారి ప్రతి హాస్టల్‌ను సందర్శించి, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jul 24 , 2025 | 01:55 AM