Davos Summit: వారు దావోస్‌కు వెళ్లింది.. ప్రచారం కోసమే!
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:34 AM
దాని వల్లే దావోస్ సమావేశాల్లో జరిగిన ఒప్పందాలు ఏమిటీ ? అందులో ఎన్ని సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి ? ఎంతమందికి ఉద్యోగాలిచ్చాయి ? వంటి అంశాలను గత ప్రభుత్వం బయటకు చెప్పలేదని అన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో పెట్టుబడులు తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ
రెండు సమావేశాల్లోనే మా సత్తా నిరూపించుకున్నాం
ఎంఎ్‌సఎంఈలకు అండగా ఉంటాం
పరిశ్రమ పెట్టకుంటే భూమి వెనక్కే
రాష్ట్రంలో హెచ్‌సీ రోబోటిక్స్ మరో రూ.500 కోట్ల పెట్టుబడి: శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రతీ ఏటా దావోస్ వెళ్లడం.. భారీ పెట్టుబడులు తెచ్చామని తప్పుడు ప్రచారం చేసుకోవడం తప్ప తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. దాని వల్లే దావోస్ సమావేశాల్లో జరిగిన ఒప్పందాలు ఏమిటీ ? అందులో ఎన్ని సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి ? ఎంతమందికి ఉద్యోగాలిచ్చాయి ? వంటి అంశాలను గత ప్రభుత్వం బయటకు చెప్పలేదని అన్నారు. సెంటిలియాన్ నెట్‌వర్క్స్‌కు చెందిన హెచ్‌సీ రోబోటిక్స్ సంస్థ తెలంగాణలో మరో రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విషయమై సెంటిలియాన్ నెట్‌వర్క్స్ ఛైర్మన్, ఎండీ వెంకట్, డైరెక్టర్ రాధా కిషోర్, ఆ సంస్థ ఇండియా ఆపరేషన్స్ హెడ్ సుధాకర్ మంత్రి శ్రీధర్‌బాబుతో సచివాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి.. హెచ్‌సీ రోబోటిక్స్ పెట్టుబడిపై ప్రకటన చేశారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేసే సెంటిలియాన్ నెట్‌వర్క్స్, హెచ్‌సీ రోబోటిక్స్ సంస్థలు డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ సాఫ్ట్‌వేర్, టెలీ కమ్యూనికేషన్, రోబోటిక్స్, విమాన రక్షణకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి రంగాల్లో తొమ్మిది దేశాల్లో పని చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రసుత్తం రెండు వేల మంది ఉద్యోగాలు కల్పిస్తున్న హెచ్‌సీ రోబోటిక్స్.. వ్యాపార విస్తరణతో మరింత మందికి ఉపాధి కల్పించనుందని తెలిపారు.
ఇక, దావోస్ పేరు చెప్పి గత ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప చేసేందేమీ లేదని ఈ సందర్భంగా అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం దావో్‌సలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లి 18 కంపెనీలతో దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుందని గుర్తు చేశారు. అందులో 17 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. దావోస్ ప్రగతికి సంబంధించి ఏడాదిలోపే తమ ప్రోగ్రెస్ కార్డు చూపించామని అన్నారు. గత నెలలో జరిగిన దావోస్ సమావేశాల్లో కుదుర్చుకున్న రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడుల వివరాలనూ వచ్చే ఏడాది దావోస్ సమావేశాలకు ముందు ప్రకటిస్తామని చెప్పారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండలో విస్తరణకు పలు ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి తెలిపారు. సెంటిలియాన్ ఇప్పటికే తమ కార్యకలాపాలను కరీంనగర్‌లో ప్రారంభించిందని చెప్పారు. వరంగల్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ)కు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరిశ్రమలకు సబ్సిడీల కింద ఇవ్వాల్సిన దానికి సంబంధించి గత ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో 2016 నుంచి రూ.4500 కోట్లు బకాయిలు పేరుకుపోయాయని మంత్రి తెలిపారు. క్రమక్రమంగా నిధులు విడుదల చేస్తూ ఆ బకాయిలను చెల్లిస్తున్నామని చెప్పారు. ఇక, సహేతుక కారణాలు చూపకపోతే పరిశ్రమల ఏర్పాటుకు గతంలో కేటాయించిన భూములను స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, ఆయా భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, పరిశ్రమల పునరుద్థరణకు గతంలో ఏర్పాటుచేసిన ఇండస్ర్టీ హెల్త్ క్లినిక్‌లపై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు మేలు జరుగుతుందని భావిస్తే నిధులు కేటాయించి వాటిని యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..