Share News

సీఎస్‌సీకి మీ‘సేవలా’?

ABN , Publish Date - Jul 13 , 2025 | 04:06 AM

మీసేవ కేంద్రాల్లో అందే పలు ఈ-గవర్నెన్స్‌ సేవలను సీఎ్‌ససీ (కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌)కు అప్పగించడం సరికాదని మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం పేర్కొంది.

సీఎస్‌సీకి మీ‘సేవలా’?

  • ఒప్పందం రద్దు చేసుకోవాలి: మీసేవ ఆపరేటర్లు

  • లేకుంటే ఈ నెల 15 నుంచి సమ్మె చేస్తామని ప్రకటన

మీసేవ కేంద్రాల్లో అందే పలు ఈ-గవర్నెన్స్‌ సేవలను సీఎ్‌ససీ (కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌)కు అప్పగించడం సరికాదని మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం పేర్కొంది. ఐటీ శాఖ పరిధిలోని ఎలకా్ట్రనిక్‌ సర్వీస్‌ డెలివరీ (ఈఎ్‌సడీ-మీసేవ) అధికారులు సీఎ్‌ససీ ఎస్పీవీ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైర శంకర్‌, ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ మోయిద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.


ఒప్పందం రద్దు చేసుకోకుంటే ఈ నెల 15 నుంచి సమ్మె చేస్తామని పేర్కొన్నారు. కాగా, పలు సేవలను సీఎ్‌ససీలకు అప్పగించినా, మీసేవ కేంద్రాలకు నష్టం లేకుండా చూస్తామని ఈఎ్‌సడీ కమిషనర్‌ రవికిరణ్‌ తెలిపారు. మీసేవ కేంద్రాల్లో లభించని కొన్ని సేవలు అందించేందుకే సీఎ్‌ససీతో ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 04:06 AM