Share News

Maoist Party: 20న ఏపీ, తెలంగాణ బంద్‌కు నక్సల్స్‌ పిలుపు

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:01 AM

దండకారణ్యంలో ఆపరేషన్‌ కగార్‌ దాడులను నిరసిస్తూ ఈ నెల 20న ఏపీ, తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

Maoist Party: 20న ఏపీ, తెలంగాణ బంద్‌కు నక్సల్స్‌ పిలుపు

హైదరాబాద్‌, చర్ల, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): దండకారణ్యంలో ఆపరేషన్‌ కగార్‌ దాడులను నిరసిస్తూ ఈ నెల 20న ఏపీ, తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ఆదివారం ఓ లేఖ విడుదలైంది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.


మావోయిస్టులను పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి, చంపేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ ప్రారంభించిన తర్వాత 550కి పైగా మావోయిస్టులను హత్య చేశారని పేర్కొన్నారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని, ఆదివాసీల హత్యలను ఆపివేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 16 , 2025 | 04:01 AM