Manne Govardhan Reddy: సీఎం రమేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలి
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:54 AM
ఏపీ ఎంపీ సీఎం రమేశ్‌పై బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో తిరగాలన్నా, మంచిగా ఉండాలన్నా, ఆయన తన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమని తప్పుడు ప్రచారం
సీఎం రమేశ్‌పై ఠాణాలో బీఆర్‌ఎస్ నేత మన్నె ఫిర్యాదు
ఏపీ ఎంపీ సీఎం రమేశ్‌పై బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో తిరగాలన్నా, మంచిగా ఉండాలన్నా, ఆయన తన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమవుతుందంటూ ఏపీ ఎంపీ సీఎం రమేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మన్నె గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఎంపీ సీఎం రమేశ్‌పై శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన సీఎం రమేశ్.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులకు భయపడి, మనుగడ కాపాడుకోవడానికే బీజేపీలో ఆశ్రయం పొందారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎప్పుడో వచ్చిన బెయిల్ సంగతి ఇప్పుడు చెబుతూ కేటీఆర్‌పై అవాకులు, చవాకులు పేలడం సీఎం రమేశ్‌కు తగదన్నారు.