Mahindra University: డ్రగ్స్ కలకలంపై మహీంద్రా వర్సిటీ వీసీ సీరియస్
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:38 AM
మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం, అరెస్టుల నేపథ్యంలో ఆ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ యాజులు సీరియ్‌సగా స్పందించారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం, అరెస్టుల నేపథ్యంలో ఆ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ యాజులు సీరియ్‌సగా స్పందించారు. మత్తు పదార్థాల వినియోగం, వాటిని కలిగి ఉండటం, సరఫరా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే లేదా విద్యార్థుల శ్రేయస్సుకు హానీ కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నియమాలు ఉల్లంఘించిన వారు దోషులుగా తేలితే.. వర్సిటీ నిబంధనలు, చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. .