Share News

Mahesh Kumar Goud: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఘనత కాంగ్రెస్‌‌దే..

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:19 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత కాంగ్రె్‌సదేనని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్‌ బేరర్లకు సూచించారు.

Mahesh Kumar Goud: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఘనత కాంగ్రెస్‌‌దే..

  • ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి

  • డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్‌ చైర్మన్ల భేటీలో మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత కాంగ్రె్‌సదేనని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్‌ బేరర్లకు సూచించారు. బీసీ రిజర్వేషన్లకు హీరోలుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలను నిలబెట్టాలన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రెండు సవరణ బిల్లులను శాసనసభ ఆదివారం ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో.. జూమ్‌ ద్వారా డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్‌ బేరర్లతో సమావేశమయ్యారు.


పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌.. బీసీలను అణగదొక్కారని మండిపడ్డారు. సవరణ బిల్లులను తెచ్చి బీసీలకు రాజకీయంగా సుస్థిర స్థానం కల్పిస్తున్న ఘనత కాంగ్రె్‌సదేనన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్‌, మంత్రులు చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు పల్లెపల్లెన విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా కాంగ్రెస్‌ జెండా ఎగరాలన్నారు. కాగా, శాసనసభలో బీసీ బిల్లులను ఏకగీవ్రంగా ఆమోదించిన నేపథ్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ బీసీ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచారు.

Updated Date - Sep 01 , 2025 | 04:19 AM