Share News

యువత గాంధీ అడుగుజాడల్లో నడవాలి

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:57 PM

జాతిపిత మహాత్మగాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

యువత గాంధీ అడుగుజాడల్లో నడవాలి

- గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల సర్కిల్‌, జనవరి 30 (ఆంద్రజ్యోతి): జాతిపిత మహాత్మగాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం గద్వాల పుర పరిధిలోని చింతలపేటలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళి అర్పించారు. గాంధీ ఆశ య సాధనలో నియోజకవర్గ అభివృద్ధికి శక్తివం చన లేకుండా కృషి చేస్తానని అన్నారు. మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

వర్గీకరణ ఫలాలు అందరికీ అందాలి

గద్వాల న్యూటౌన్‌: ఎస్పీ మాదిగ ఉపకులాల ప్రజలకు వర్గీకరణ ఫలాలు అందేవరకు సం పూర్ణ మద్దతు ఇస్తానని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో జరగబోయే లక్ష డప్పులు.. వెయ్యి గొంతులు సన్నాహక కళాప్రదర్శన విజయవంతానికి తనవంతు మద్దతుగా ఎమ్మెల్యే చేతులమీదుగా ఎమ్మార్పీఎస్‌ నాయకులకు డప్పులు అందజేశారు. కార్యక్రమంలో బోయ వెంకట్రాములు, ఎమ్మార్పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ రాజేష్‌, రామన్‌గౌడ్‌, రాజశేఖర్‌, నాయకులు ఉన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:57 PM