Share News

యువత క్రీడా రంగంలో రాణించాలి

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:00 PM

దేశమే గర్వించేలా యువకులు క్రీడా రంగంలో రాణించా లని బీజేపీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్‌ రెడ్డి అన్నారు.

యువత క్రీడా రంగంలో రాణించాలి
ఏపీఎల్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతకు బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొన్న బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, స్వామి ఆదిపరాశ్రీ

- బీజేపీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి

ఊట్కూర్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): దేశమే గర్వించేలా యువకులు క్రీడా రంగంలో రాణించా లని బీజేపీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఊట్కూర్‌ మండలం అవుసులోన్‌పల్లి గ్రామం లో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత నిడుగుర్తి గ్రామానికి చెందిన విరాట్‌ కోహ్లీ-18 జట్టుకు స్వామి ఆదిపరాశ్రీతో కలిసి మొదటి బహుమతి రూ.50 వేల నగదుతో పాటు, కప్పును, ద్వితీయ స్థానంలో నిలిచిన రోహిత్‌ జట్టుకు రూ.30 వేల నగదును అందించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొన్నప్పుడే మానసిక వికాసం, శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. నేర్చు కోవాలనే కోరిక, ఆడి గెలవాలనే పట్టుదల ఉంటే పల్లె నుంచి కూడా జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అన్నారు. అంతకు ముందు స్వామి ఆదిపరాశ్రీ మాట్లాడుతూ యువకులు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్‌ నిర్వాహకులు నరసింహ, రవికుమార్‌, నరేష్‌, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 11:00 PM