గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:11 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి రాజేశ్వర్ అన్నారు.

- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్
మిడ్జిల్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి రాజేశ్వర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరేష్‌నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతితో కలిసి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా వెలుగొమ్ముల గ్రామానికి చెందిన చిర్ర శేఖర్‌రెడ్డి, బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడిగా బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన పిట్టల ఆంజనేయులు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడిగా రాణిపేట గ్రామానికి చెందిన వాడ్యాల ఆంజనేయులు, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడిగా ఈదులబాయితండాకు చెందిన పాత్లవత్ శ్రీనునాయక్‌ను ఎన్నుకున్నారు. నాయకులు వాసుదేవ్, దేవేందర్, నారాయణ, నరేష్, ఆంజనేయులు, శివశంకర్, సతీష్, చంద్రశేఖర్, ఆశోక్‌యాదవ్, అనిల్‌కుమార్, ఎల్లయ్య, హుస్సేన్, నవీన్, చింతకాయల శేఖర్, సైదులు, ఆంజి, శివ, మల్లేష్ ఉన్నారు.