Share News

సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:08 PM

పాలమూరు పురపాలికలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఇందుకోసం రూ.250 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరడం జరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి
అభయాంజనేయస్వామి ఆలయంలో షెడ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- పాలమూరుకు రూ.250 కోట్లు కేటాయించాలని సీఎంను కోరాం

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు పురపాలికలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఇందుకోసం రూ.250 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరడం జరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పాలమూరు పురపాలిక కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ కానుంనందున్న పెద్దఎత్తున నిధులు వస్తాయన్నారు. శనివారం పాలమూరు పురపాలిక పరిధిలోని 21, 11, 14, 15, 32 వార్డుల్లో రూ.2.30 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు పురపాలిక పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని కాలనీలు అభివృద్ది చెందనున్నాయన్నారు. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు అవసరమైన ఆలయాల్లో షెడ్లు ఇతరత్ర అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నాయకులు సిరాజ్‌ఖాద్రి, బెక్కరి అనిత, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, అచ్చుగట్ల అంజయ్య, లతాశ్రీ, కోట్ల నరసింహ పాల్గొన్నారు.

భగవంతుని సేవలో తరించాలి

మహబుబ్‌నగర్‌ రూరల్‌ : మన్యంకొండ దేవస్థాన నూతన ట్రస్ట్‌ సభ్యులు భగవంతుని సేవలో తరించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మన్యంకొండలో దేవస్థాన ఆవరణలో నూతనంగా నియమితులైన ఆలయ ట్రస్ట్‌ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై, మాట్లాడారు. ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం జిల్లా గ్రఽథలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహరెడ్డి, ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్‌కుమార్‌ 13 మంది ట్రస్ట్‌ బోర్డు సభ్యులతో దేవస్థాన కార్యనిర్వాహక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మపూర్‌ నర్సింహరెడ్డి, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:08 PM