Share News

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:31 PM

క్రీ డల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చా టాలని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కళాశాల జీ మోహ న్‌బాబు అన్నారు.

  క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం

- పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీ మోహన్‌బాబు

- ముగిసిన ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్‌ క్రీడా పోటీలు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): క్రీ డల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చా టాలని పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కళాశాల జీ మోహ న్‌బాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఉమ్మడి పాలిటెక్నిక్‌ కళా శాల ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల, కళాశాల స్థాయి నుంచే క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతిభ గల క్రీడా కారులకు కొదవలేదని, ఎంతో మంది జిల్లా క్రీడాకారు లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. టోర్నీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతార న్నారు. కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహించారు. వనపర్తి, పె బ్చేర్‌, గద్వాల, వడ్డేపల్లి, కోస్గి, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ, జేపీ ఎన్‌సీ కళాశాలల జట్ల క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా కోశాధి కారి(డీటీవో) శ్రీనివాస్‌, కళాశాల జీ. మోహన్‌ బాబు, అధ్యాపకులు అప్పారావు, వీరస్వామి, రాజేశ్వరి, ప్రవీ ణ, పీడీ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

అథ్లెటిక్స్‌ ఫలితాలు...

బాలుర విభాగంలో 400 మీటర్ల రిలే పరుగులో మహబూబ్‌ నగర్‌ కళాశాల ప్రథమ, వడ్డెపల్లి కళాశాల ద్వితీయ, బాలికల వి భాగంలో రిలే పరుగులలో పెబ్బేర్‌ కళాశాల ప్రథమ, మహ బూబ్‌నగర్‌ కళాశాల ద్వితీయ స్థానాలను దక్కించుకున్నాయి. బాలుర విభాగంలో 100 మీటర్ల పరుగులో ఎం. వినీత్‌ ప్రథమ, శివశంకర్‌ ద్వితీయ(మహబూబ్‌నగర్‌),200 మీటర్ల పరుగులో ఎం. వినీత్‌ ప్రథమ(మహబూబ్‌నగర్‌, తేజ ద్వితీయ (కోస్గి), 400 మీటర్లలో రజినికాంత్‌ ప్రథమ. వై మురళి ద్వితీయ (మహ బూబ్‌నగర్‌), 800 మీటర్లలో విఘ్నేశ్వర్‌ ప్రథమ, శివకుమార్‌ ద్వితీయ, 1500 మీటర్లలో శివకుమార్‌ ప్రథమ (మహబూబ్‌ నగర్‌), తేజ ద్వితీయ(కోస్గి) స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో 100 మీటర్ల పరుగులో మైత్రి ప్రథమ(పెబ్బేర్‌), స్నేహ ద్వితీయ(మహబూబ్‌నగర్‌), 200 మీటర్లలో భవాని-ప్రథ మ (జేపీఎన్‌సీఈ), మైత్రి ద్వితీయ (పెబ్బేర్‌), 400 మీటర్లలో నందిని ప్రథమ (పెబ్బేర్‌), పల్లవి ద్వితీయ(మహబూబ్‌నగర్‌), 800 మీటర్లలో ప్రఽశాంతి, చందన ద్వితీయ (మహబూబ్‌నగర్‌), 100 మీటర్లలో నిఖిత ప్రథమ (మహబూబ్‌నగర్‌), అనూష ద్వితీయ(కోస్గి) స్థానాల్లో నిలిచారు.

Updated Date - Jan 25 , 2025 | 11:31 PM