ఆపరేషన్ థియేటర్ ఎందుకు వాడుకోవడం లేదు?
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:45 PM
నారాయణపేట జిల్లా మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ థియేటర్ వాడకపోవడంపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. అన్ని సౌకర్యాలు ఉన్నా థియేటర్‌ను ఎందుకు వాడుకోవడం లేదని వైద్యాధికారులను ప్రశ్నించారు.

మద్దూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులపై కలెక్టర్ ఆగ్రహం
మద్దూర్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆపరేషన్ థియేటర్ వాడకపోవడంపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. అన్ని సౌకర్యాలు ఉన్నా థియేటర్‌ను ఎందుకు వాడుకోవడం లేదని వైద్యాధికారులను ప్రశ్నించారు. నారాయణపేట్, మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే దానిని వినియోగంలోకి తెచ్చి, ఇక్కడే ఆపరేషన్లు చేయాలని ఆదేశించారు. థియేటర్ ముందు భాగంలో ఉంచిన మందులను వేరే గదిలోకి మార్చి, థియేటర్‌లోని పరికరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అన్ని పరీక్షలు, ఆపరేషన్లు ఇక్కడే చేయాలని, రెఫర్ అనే మాటే ఉండొద్దన్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వహించే డాక్టర్, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు ఎంతమంది ఉన్నారని, విధులకు ఎప్పుడు వస్తున్నారని ఆరా తీశారు. ఏడుగురు డాక్టర్లు ఎనిమిది గంటల చొప్పున మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తునట్లు ఆస్పత్రి సమన్వయ కర్త కలెక్టర్ వివరించారు. ఓపీ విభాగంలో రోగుల వివరాలను తెలుసుకున్నారు. మహిళ, పురుషుల, చిన్న పిల్లల వార్డులను పరిశీలించి, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.