అడ్డుకట్ట ఎక్కడ?
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:44 PM
విద్యాశాఖలో నిబంధనలకు అధికా రులు తిలోదకాలు ఇస్తున్నారు. అసలు విద్యాశాఖ లో ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు డిప్యు టేషన్, కానీ సర్దుబాటు కానీ చేయాలంటే కలెక్టర్ అనుమతి తప్పనిసరి.

- విద్యాశాఖలో అక్రమ డిప్యుటేషన్ల వ్యవహారం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం జనవరి 30 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో నిబంధనలకు అధికా రులు తిలోదకాలు ఇస్తున్నారు. అసలు విద్యాశాఖ లో ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు డిప్యు టేషన్, కానీ సర్దుబాటు కానీ చేయాలంటే కలెక్టర్ అనుమతి తప్పనిసరి. ఇతర జిల్లాలో డిప్యుటేషన్ కోసం అక్కడి జిల్లా ఉన్నతాఽధికారి సూచన మేరకే సర్దుబాటు కాని డిప్యుటేషన్ ఇచ్చారు. కానీ పాల మూరు జిల్లాలో మాత్రం జిల్లా విద్యాశాఖ అధికారి కి గాని, కార్యాలయంలో ఉండే ఏడీ, సూపరిం టెండెంట్స్ గాని ఏ టీచర్ ఎక్కడ పని చేస్తున్నార న్నది తమకు తెలీదని చెబుతుండటం గమనార్హం. అసలు జిల్లాలో ఏ ఒక్క టీచర్‌కు డిప్యుటేషన్ ఇవ్వ లేదని విద్యాశాఖ కార్యాలయ వర్గాలు చెపుతున్నా యి. మండల విద్యాశాఖ అధికారులు చెప్పే మా ట వింటే మరొక రకంగా ఉంది. సుమారు 20 మం ది టీచర్లు డిప్యుటేషన్స్‌లో ఉన్నారని చెపుతున్నారు. వారి వివరాలు చెప్పేందుకు కొందరు ఎంఈవోలు జంకుతున్నారు. డిప్యూటేషన్ ఉన్న వారి పేరు చెబితే మాకు ఇబ్బంది అవుతుందని కొందరు అం టుంటే.. మరికొందరు తాము బాధ్యతలు తీసుకోక ముందే ఇచ్చారని తెపుతున్నారు... కొందరి పేర్లను డీఈవో కూడా చెప్పడం లేదు అని ఓ మండల వి ద్యాశాఖ అధికారి చెపుతున్నారు. అంటే ఎంత గో ప్యంగా ఈ డిప్యుటేషన్స్ వ్యవహారం కొనసాగుతుం దో అర్థం అవుతుంది. మిడ్జిల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ స్కూల్ నుంచి జిల్లా కేంద్రంలోని బోయపల్లి ఉన్న త పాఠశాలకు ఓ ఆంగ్ల ఉపాధ్యాయులు డిప్యు టేషన్‌పై కొనసాగుతున్నారు. మరికొందరు టీచర్లు ఇతర మండలం నుంచి మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్ మండలాల్లో కొనసాగుతున్నారు. బోయపల్లి లో పని చేసే ఆంగ్ల ఉపాధ్యాయుడు బీఎడ్ కళా శాలలో నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహి స్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల ప్రకారం పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులను ఎవ్వరిని కూడా బీఎడ్, డీఎడ్ కళాశాలలకు డిప్యుటేషన్ ఇ వ్వకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కేవలం డైట్, బీఎడ్ కళాశాలల్లో రిటైర్డ్ ఉపాధ్యాయులను, రిటైర్డ్ అధ్యాపకులతో పాటు నిరుద్యోగులను మాత్ర మే కళాశాలలో అధ్యాపకులుగా తీసుకోవాలి.. కానీ జి ల్లాలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కొనసా గుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
- జిల్లాలో 20 మందికి పైగా అక్రమ డిప్యుటేషన్
జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా 20 మందికి పైగా అక్రమ డిప్యుటేషన్స్ కొనసాగుతున్నట్లు మం డల విద్యాశాఖ అధికారులు చెపుతున్న లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. ఉపాధ్యాయులు లేని పాఠ శాలల్లో విద్యార్థులకు బోధన కుంటు పడకుండా మరో 70 మందికి పైగా ఉపాధ్యాయులు ఆయా మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినట్లు తెలుస్తున్నది. మరికొందరు ఎంఈవోలు వివరాలు చెప్పేందుకు అసలు ముందుకు రావడం లేదు. మేము ఎంఈవోలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్క డిప్యుటేషన్ గాని, సర్దుబాటు గాని చేయలేదు. గతంలో ఇచ్చారు.. మాకు ఏమీ తెలియదంటూ సమాధానం చెపుతున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ కార్యాలయంలో గాని జిల్లా విద్యాశాఖ అధికారి దగ్గర కనీసం ఒకరి కి సంబంధించి వివరాలు లేవని విద్యాశాఖ కార్యా లయం సూపరింటెండెంట్ శంభు ప్రసాద్ చెప్ప డంపై పలు ఆరోపణలకు తావు ఇస్తున్నాయి.
- మండలాల వారీగా ...
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆయా మండల విద్యాశాఖ అఽధికారులు చెప్పిన లెక్కల ప్రకారం ఇలా ఉన్నాయి.. మిడ్జిల్ మండలం నుంచి బోయ పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకరు, బాలాన గర్ మండలం నుంచి ఎర్రవల్లి తండాలో ఒకరు డిప్యుటేసన్‌పై పని చేస్తున్నారు. బోయపల్లి ఉన్నత పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు బీఎడ్ కళాశాలలో పనిచేస్తున్నారు. మరో నలుగురు ్ఞఅదే మండలంలో డిప్యుటేష న్‌పై విఽధులు నిర్వహిస్తున్నారు. గండీడ్ మండల పరిధిలోని జానంపల్లి పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ మహబూబ్‌నగర్ మండలంలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. ఇదే మండలలలోని వివిధ పాఠశాలలకు నలుగురు ఉపాధ్యాయులకు డిప్యు టేషన్ ఇచ్చారు. మహమ్మదాబాద్ మండలంలో ఆరుగురు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. బా లానగర్ మండలంలోని నేలబండతండా నుంచి దే వరకద్ర మండలం పీఎస్ నాగారంలో డిప్యుటేష న్‌పై కొనసాగుతున్నారు. మరో ఇద్దరు మండల పరిధిలోనే డిప్యుటేషన్ విధులు నిర్వహిస్తున్నారు. భూత్పూర్ మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. దేవరకద్రలో న లుగురు డిప్యుటేషన్‌పై ఉన్నారు. హన్వాడ మండ లంలో ఇద్దరు ఉపాధ్యాయులు మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలోని బోయపల్లి పీఎస్, మ రొకరు ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతుండగా, నలుగురు అదే మండలంలో డిప్యుటేషన్‌పై కొన సాగుతున్నారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ లో ఒకరు, అదే మండలంలో ఆరుగురు ఉన్నారు. బోయపల్లి పాఠశాలలోనే ముగ్గురు డిప్యుటేషన్‌పై పనిచేయడం విమర్శలకు తావిస్తోంది.
డిప్యుటేషన్ రద్దు చేయాలని ఆదేశించా
జిల్లా ఉపాధ్యాయులకు గతంలో డిప్యుటేషన్ ఇ చ్చారు. డిప్యుటేషన్ ఎంత మంది ఉన్నారని వివరా లు తీసుకుని వారందరివి డిప్యుటేషన్ రద్దు చేస్తాం. వారి వారి ప్లేస్‌లకు పంపి స్తాం. వచ్చే విద్యాసంవత్సరంలో డిప్యుటేషన్ అవస రం ఉంటే కల్టెకర్ అనుమతితోనే ఇస్తాం. ఉపాధ్యా యులు కూడా బీఎడ్ కళాశాలలో చేస్తున్నారన్న వి షయం తెలియదు. దీనిపై వివరణ తీసుకొని పాఠ శాలకు పంపిస్తా. డిప్యుటేషన్ రద్దు చేయమని గ తంలో నిర్వహించిన సమావేశంలోనే ఆదేశించాను. డిప్యుటేషన్ రద్దు చేయాలని ఉత్తర్వులు చేస్తాం.
-ఎ.ప్రవీణ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అఽధికారి