Share News

వాట్సాప్‌ గ్రూప్‌ హ్యాక్‌.. మోసానికి యత్నం

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:41 PM

పోలీస్‌ అధికారి పేరుతో గ్రూప్‌ అడ్మిన్‌ సభ్యులను పరిచయం చేసుకొని వాట్సాప్‌ గ్రూప్‌లోని చొరబడి గ్రూప్‌ మొత్తాన్ని కేటుగాళ్లు ఆధీనంలోకి తీసుకున్నారు.

వాట్సాప్‌ గ్రూప్‌ హ్యాక్‌.. మోసానికి యత్నం

- పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రూపు అడ్మిన్‌ - గద్వాలలో ఘటన

గద్వాల క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ అధికారి పేరుతో గ్రూప్‌ అడ్మిన్‌ సభ్యులను పరిచయం చేసుకొని వాట్సాప్‌ గ్రూప్‌లోని చొరబడి గ్రూప్‌ మొత్తాన్ని కేటుగాళ్లు ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో గ్రూపు సభ్యులతో పాటు ప్రజలను మోసం చేస్తున్నారని ఓగ్రూప్‌ అడ్మిన్‌ విజయ్‌కుమార్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి గ్రూప్‌ అడ్మిన్‌, పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు... తాను సీఐని అంటూ గ్రూప్‌ అడ్మిన్‌ సభ్యులను కొంతమంది కేటుగాళ్లు పరిచయం చేసుకుంటూ గద్వాల నియోజకవర్గంలోని ఓ గ్రూప్‌లో చేరారు. పోలీ స్‌ సీఐ కదా అని ఆ కేటుగాళ్ల నంబరును గ్రూ ప్‌లో జాయిన్‌ చేశారు. అంతటితో ఆగకుండా తమ పోలీస్‌ సిబ్బందిని జాయిన్‌ చేయాలని, గ్రూప్‌ అడ్మిన్‌ కూడా ఇవ్వాలని కోరడంతో ఇ చ్చేశారు. గ్రూప్‌ అడ్మిన్‌ అయిన వెంటనే గ్రూపును తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. హ ర్షసాయి ట్రస్ట్‌ పేరుతో రూ.2000 కడితే రూ.18,500 ఇస్తామని నమ్మబలికుతూ మెసే జ్‌లు పెట్టారు. దీంతో కొందరు ఈ విషయాన్ని గ్రూప్‌ను ఏర్పాటు చేసిన అడ్మిన్‌ విజయ్‌కుమా ర్‌కు తెలిపారు. ఆయన వెంటనే గ్రూప్‌లో ఉన్న సభ్యులు ఇది నమ్మవద్దని, గ్రూప్‌ హ్యాక్‌ అ య్యిందని సమాచారం ఇచ్చారు. అనంతరం శుక్రవారం రాత్రి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేటుగాళ్ల ఫోన్‌నంబర్‌పై ఆరా తీస్తానని ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ తెలిపారు. అయితే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మరో గ్రూప్‌ను ఇలాగే హ్యా క్‌ చేయడం కొసమెరుపు.

Updated Date - Jan 31 , 2025 | 11:41 PM