అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:46 PM
అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అం దజేస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శని వారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

- ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి అర్బన్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అం దజేస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శని వారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనం తరం మాట్లాడుతూ సంక్షేమ పథకాల విష యంలో ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని సూ చించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రాజీనా మా చేయాలంటూ ఇటీవల కేటీఆర్ మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. దమ్ముంటే తండ్రీ కొడుకులు, బావ ముగ్గురు రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని.. మీకు డిపాజిట్లు కూడా గల్లం తవ్వడం ఖాయమని సవాల్ విసిరారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయిం చిన మీరు నేడు గ్రామగ్రామాన హరికథలు చె ప్తే నమ్మేవారు ఎవరూ లేరని విమర్శించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు ప్రతీ ఒక్కరు కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.