Share News

సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:31 PM

సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజాపాల కొనసాగు తోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.

సంక్షేమమే లక్ష్యం
పెబ్బేరులో అభివృద్ధి పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి

- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెబ్బేరు రూరల్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజాపాల కొనసాగు తోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శనివారం పెబ్బేరు పట్టణం లో రూ.2.80 కోట్ల నిధులతో మురుగు కాల్వల నిర్మాణం, పాత చేపల మార్కెట్‌ దగ్గర షాపింగ్‌ మాల్‌ ఏర్పాటుకు రూ.45 లక్షలు, బస్టాండ్‌ నుంచి బైపాస్‌ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.1 కోటి, రూ.60 లక్షలతో మరో తొమ్మిది షాపుల నిర్మాణం చేపట్టేందు కు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో కలిసి శిలాఫలకాలను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిల్లో అమ లు చేస్తామన్నారు. పెబ్బేర్‌ పట్టణం, గ్రామాల అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పెబ్బేరు పట్టణంలో కొల్లాపూర్‌ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవిష్కరించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైౖర్మన్‌ కరుణశ్రీ, వైస్‌ చైౖర్మన్‌ కర్రెస్వామి, మార్కెట్‌ కమిటీ చైౖర్మన్‌ ప్రమోదిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:31 PM