కల్యాణం కమనీయం
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:59 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకర్గంలోని భోగ మహేశ్వరంలో గురువారం తెల్లవారుజామున శివ పార్వతుల కల్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

- భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కల్యాణోత్సవం
-కనుల పండువగా ప్రభోత్సవాలు
- ఉమామహేశ్వరంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
- భారీగా తరలివచ్చిన భక్తులు
అచ్చంపేట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకర్గంలోని భోగ మహేశ్వరంలో గురువారం తెల్లవారుజామున శివ పార్వతుల కల్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుఽధవారం రాత్రి ఉమా మహేశ్వర ఆలయానికి అచ్చంపేట నియోజకవర్గం నుంచి విద్యుద్దీపాలతో అలకరించిన ప్రభోత్సవాలు మంగళవాద్యాలతో గురువారం తెల్లవారుజామున ఉమామహేశ్వర కొండ దిగువన ఉన్న భోగ మహేశ్వరానికి చేరుకున్నాయి. భోగమహేశ్వరంలోని కల్యాణమండపంలో శివపార్వతుల కల్యాణం అర్చక స్వాములు తెల్ల వారుజామున నా లుగు గంటలకు అంగరంగ వైభవం గా జరిపించారు. స్థాని క ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ ఆయన సతీమణి అనురాధ కల్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పిం చారు. వివిధ గ్రామాల నుంచి తీసుకువచ్చిన తలంబ్రాలను కల్యాణం వద్ద సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవ రెడ్డి, పాలక మండలి సభ్యులు, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను చేశారు. ఈ ఏడాది నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం రాజగోపురం పునరుద్ధరణతో భోగ మహేశ్వరం విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయిం ది. అనంతరం పల్లకీలో ఉమామహే శ్వరం కొండ పైకి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్ళారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు.