రైతులకు అండగా ఉంటాం
ABN , Publish Date - Feb 22 , 2025 | 11:32 PM
రైతులకు ఎళ్లవేళలా అండగా ఉంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
- రైతులకు సబ్సిడీ ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ
పాలమూరు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : రైతులకు ఎళ్లవేళలా అండగా ఉంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ అవసరాల కోసం రైతులకు సబ్సిడీ లో 20 ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేసి, మాట్లాడారు. వేసవిలో రైతులు వేసిన పంటలు నష్టపోరాదనే ఉద్ధేశంతో విద్యుత్ అధికారులతో మాట్లా డి, రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆదేశించారు. ప్రతీ మూడు నెలలకోసారి రైతుల సమస్యలు తెలుసుకు నేందుకు ప్రజావాణి తరహా కార్యక్రమం చేపడు తామన్నారు. ఎస్‌ఈ పి.వెంకటరమేష్, డీఈ ల క్ష్మణ్, ఏడీ మద్దిలేటి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, హన్వాడ నాయకులు మహేందర్, సుధాకర్‌రెడ్డి, వెంకటాద్రి, రాజుగౌడ్, రామచంద్ర య్య, శ్రీనివాస్, బుద్దారం సుధాకర్‌రెడ్డి, సిరిగిరి మురళీధర్, మోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి, ఆంజ నేయులు, రామస్వామి పాల్గొన్నారు.
పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం క్రిష్టియన్‌పల్లిలోని ప్రభుత్వ ఎంవీఎస్ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో పీఎం ఉషా పథకం కింద రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించనున్న హాస్టల్ భవనానికి భూమి పూజ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి, మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్, సుధాకర్‌రెడ్డి, రామచందరయ్య, రాజుగౌడ్, శ్రీనివాస్ యాదవ్, నర్సింహ్మ రెడ్డి పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు
మహబూబ్‌నగర్ రూరల్ : అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శని వారం మండలంలోని పోతన్‌పల్లి, ఓబులాయపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి, నూతనంగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అదే విధంగా రెండు గ్రామాల్లో కలిపి రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనిత, ధర్మాపూర్ నరసింహారెడ్డి, మోహన్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.