Share News

ఆర్డీఎస్‌కు వెంటనే నీరు విడుదల చేయాలి

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:01 AM

తెలంగా ణ ప్రాంత రైతులను దృష్టిలో ఉంచుకుని ఆర్డీ ఎస్‌కు వెంటనే నీరు విడుదల చేయాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు.

ఆర్డీఎస్‌కు వెంటనే నీరు విడుదల చేయాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి

వడ్డేపల్లి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగా ణ ప్రాంత రైతులను దృష్టిలో ఉంచుకుని ఆర్డీ ఎస్‌కు వెంటనే నీరు విడుదల చేయాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. సకాలంలో కాలువకు నీరు విడుదల చేయకపోవడంతో రబీలో సాగు చేసిన పంటలు ఎండే ప్రమాదం ఉందన్నారు. వడ్డేపల్లి సమీపంలోని ఆర్డీఎస్‌ కాలువ వద్ద ఆది వారం బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశా రు. ఈసందర్బంగా రామచంద్రారెడ్డి మాట్లాడు తూ కర్ణాటక రైతులు అక్రమంగా నీటిని తోడేసు కుంటున్నారని, 11రోజులు అవుతున్నా ఆర్డీఎస్‌కు చుక్క నీరు రాని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నియెజకవర్గం నాయకులు, ఇన్‌చార్జీలు ఎవ్వరూ పట్టించుకోక పోవడం శోఛనీయమన్నా రు. అలంపూర్‌ నియోజకవర్గంలో ఉన్న ఆర్డీఎస్‌ ఆయకకట్టు రైతులు రబీలో మొక్కజొన్న, మిర్చి, పొగాకు, వేరుశనగ పంట సాగు చేసుకున్నారని, సకాలంలో నీరు విడుదల కాకపోతే నీటి తడు లు లేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్వయం రైతులు చెబుతున్నారన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్‌ ఇం డెంట్‌ వాటా నీరు కలిసి సుంకేసుల, ఆర్టీఎస్‌కు వచ్చేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు లేద న్నారు. ఏపీ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్న హెచ్‌ ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువలకు కేసీ కెనాల్‌ వా టాను విడుదల చేయించుకోవడంతో తెలంగా ణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం తో చర్చించి రెండు వాటాలు ఒకేసారి విడుదల చేయించే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా జాయింట్‌ వాటా కలిసి సుంకేసుల, ఆర్టీఎస్‌లకు వచ్చే అవకాశం ఉందన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్ర రైతులపై ఎందుకు వివక్ష చూపుతున్నా రని ప్రశ్నించారు. తక్షణమే నీటి విడుదల విష యంలో ప్రభుత్వం స్పందించి ఆర్డీఎస్‌కు నీరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడికొండ భీమ్‌సేన్‌ రావు, వడ్డేపల్లి, రాజోలి, అయిజ మండలాల అధ్యక్షులు నర్సింహులు, సంజీవరెడ్డి, గోపాల కృష్ణ, అయిజ పట్టణ ప్రధాన కార్యదర్వి కంపాటి భరత్‌ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌యాదవ్‌, వడ్డేపల్లి మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్‌, అశోక్‌, శశి, పీజే వెంకటేష్‌ ఉన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 12:02 AM