Share News

ఓటు వజ్రాయుధం

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:21 PM

ఓటు వజ్రాయుధం లాంటిదని, ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకో వాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు.

ఓటు వజ్రాయుధం
ర్యాలీని ప్రాంభిస్తున్న రెవెన్యూ అదనపు ఎస్‌.మోహన్‌రావు

అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

జెండా ఊపి జాతీయ ఓటరు అవగాహన ర్యాలీ ప్రారంభం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌/చిన్నచింతకుంట/రాజాపూర్‌/భూత్పూర్‌/దేవరకద్ర/మహమ్మదాబాద్‌/మూసాపేట/గండీడ్‌/జడ్చర్ల జనవరి, 25 (ఆంధ్రజ్యోతి) : ఓటు వజ్రాయుధం లాంటిదని, ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకో వాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు అన్నారు. శనివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా మీదుగా స్టేడియం గౌండ్‌ వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన ర్యాలీని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పాల్గొని ప్ల కార్డులు చేత పట్టి ‘మన ఓటు - మన హక్కు, ఓటు ఈజ్‌ యువర్‌ వాయిస్‌’ వంటి నినాదాలతో ఓటు ప్రా ముఖ్యతపై అవగాహన కల్పించారు. ర్యాలీలో ఆర్డీవో నవీన్‌, అర్బన్‌ తహసీల్దార్‌ ఘన్సీరామ్‌ పాల్గొన్నారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసన్నరాణి విదార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ప్రతిజ్ఞ చేశారు. రాజాపూర్‌ మండల కేంద్రంలో విద్యార్థులు, రెవెన్యూ అధికారులు ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, డీటీ భారతి, ఆర్‌ఐ మంజుల, రాజేశ్వరి పాల్గొన్నారు. భూత్పూర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టి, చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. తహ సీల్దార్‌ అబ్దుల్‌ రహమాన్‌, ఎంపీడీవో ప్రభాకర్‌ చారి పాల్గొన్నారు. దేవరకద్ర, కౌకుంట్ల మండల కేంద్రంలో ఎన్నికల రిట్నరింగ్‌ అధికారి మధునా యక్‌ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ కృష్ణయ్య, ఎంపీడీవో శ్రీనువాసులు, డీటీ దీపిక, ఆర్‌ఐ శరత్‌, తిరుపతయ్య, నరేష్‌, భక్తరాజు పాల్గొన్నారు. మహమ్మదాబాద్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠ శాల విద్యార్థులతో కలిసి తహసీల్దార్‌ తిరుపతయ్య ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో రాజు నాయక్‌, ఇన్‌చార్జి హెచ్‌ఎం పాండురంగారెడ్డి పాల్గొన్నారు. మూసాపేట మండల కేంద్రంలో తహసీల్దార్‌ రాజు ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి, నాయబ్‌ తహసీల్దార్‌ వినోద్‌కుమార్‌, గిర్దావర్లు రవికుమార్‌, అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు. గండీడ్‌ మండల కేంద్రంలో డీటీ మాధవి ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. జడ్చర్లలో తహసీల్దార్‌ బ్రహ్మంగౌడ్‌, నయాబ్‌ తహసీల్దార్‌ మహబూబ్‌అలీ ఆధ్వర్యంలో పట్టణంలోని బాదేపల్లి బాలుర జడ్పీహెచ్‌ఎస్‌ నుంచి గాంధీచౌక్‌ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్‌ వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఎంఈవో మంజులాదేవి పాల్గొన్నారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్‌ సుకన్య విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అధ్యాపకులు రాఘవేంద్రరెడ్డి, డాక్టర్‌ సదాశివయ్య, నర్సిములు, నరసింహరావు, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:21 PM