అధికారికంగా వేమన జయంతి నిర్వహించాలి
ABN , Publish Date - Jan 19 , 2025 | 11:16 PM
రాష్ట్ర ప్రభుత్వం యోగి వేమన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ సామల పాపిరెడ్డి కోరారు.
పాలమూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం యోగి వేమన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ సామల పాపిరెడ్డి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో యోగి వేమన జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో వేమన జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించాన్నారు. తెలుగు యూనివర్సిటీకీ సురవరం ప్రతాపరెడ్డి పేరును నామకరణం చేయాలన్నారు. రెడ్ల సమైఖ్యతకు, సంఘటీకరణ కోసం సేవా భావంతో సేవలందించే రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు కావాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, సేవా సమితి అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మద్ది అనంతరెడ్డి, మల్లు నరసింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, రాఘవరెడ్డి, మద్ది యాదిరెడ్డి, మహిళా సంఘం నాయకులు సరస్వతి, స్వరూప, శోభ, అనిత, హేమలత పాల్గొన్నారు.