Share News

ఘనంగా వసంత పంచమి

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:33 PM

పట్టణంలోని సరస్వ తీమాత ఆలయాల్లో సోమవారం వసంత పంచమి పురస్కరించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వసంత పంచమి
సరస్వతీ ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌/మహ్మదాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని సరస్వ తీమాత ఆలయాల్లో సోమవారం వసంత పంచమి పురస్కరించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఏనుగొండలోని సరస్వతీ మాత ఆలయంలో చిన్నారులకు సాయూహిక అక్షరాభ్యాసం కనుల పండువగా నిర్వహించారు. ఎస్వీఎస్‌ మెడికల్‌ కళాశాల విద్యార్థినులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర కాలనీలోని హయగ్రీవ స్వామి ఆలయంలో చిన్నారులకు అర్చకులు వంశీకృష్ణ, సంతోష్‌కుమార్‌ అక్షరాభ్యాసం నిర్వహించారు. ఏనుగండ జ్ఞాన సరస్వతీ ఆలయంలో మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వ ర్‌రెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త వినీత శ్రీరామ్‌, కాలనీ అధ్యక్ష, కా ర్యదర్శులు సిద్దు, విష్ణు, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నా రు. మహ్మదాబాద్‌ మండలం నంచర్ల చైతన్య పాఠశాలలో సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, 56 జంటలతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మహ్మదాబాద్‌, గండీడ్‌ మండలాధ్యక్షులునారాయణ, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జడ్చర్ల పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో 50 మంది చిన్నారులకు కృష్ణానంద స్వాముల ఆధ్వర్యంలో అ క్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు ఆర్య సమాజం ఆధ్వర్యంలో సరస్వతి మాత యజ్ఞం జరిపించారు. పద్మలీల, నోముల కృష్ణయ్య, శశికళ, సుధాకర్‌, ప్రధానాచార్యులు వెంకటయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:33 PM