Share News

వనపర్తికి ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌

ABN , Publish Date - Mar 01 , 2025 | 11:35 PM

రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వి ద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాట్లలో భాగంగా వనపర్తి జిల్లాలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదు గా శంకుస్థాపన చేయనున్నారు.

వనపర్తికి ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌
ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల నమూనా

- నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన

వనపర్తి అర్బన్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వి ద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాట్లలో భాగంగా వనపర్తి జిల్లాలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదు గా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాలో ఇంజనీరింగ్‌, ఫిషరీ స్‌, వ్యవసాయ, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షి యల్‌ పాఠశాలను మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో..

సుమారు 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించనున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్కూల్‌ భవ న నిర్మాణం జరపనున్నారు. విద్యార్థులకే కాకుండా బోధన బోధనేతర సిబ్బందికి కూడా క్వార్టర్స్‌ నిర్మించనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురు కుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. 5 వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఉంటారు. ఈ స్కూల్‌లో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌తో ఇంగ్లీష్‌ మీడియం 12వ తరగతి వరకు బోధన అందించనున్నారు. విద్యార్థుల కు లైబ్రరీలతో పాటు కంప్యూటర్లు కూడా ఉండనున్నాయి. అన్ని తరగతులు డిజిటల్‌ బోర్డుల ద్వారా విద్యాబోధనలు చేయనున్నారు.

నేడు రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియ ల్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవన నిర్మాణానికి ఇప్పటికే ఎమ్మెల్యే మేఘారెడ్డితో పాటు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని చందాపూర్‌ రోడ్డులో స్థల సేకరణ కూడా పూర్తి చేసినట్లు సమాచారం.

Updated Date - Mar 01 , 2025 | 11:35 PM