Share News

కూలీలకు ఉపాధి పనులు కల్పించాలి

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:17 PM

గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కల్పించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకొని పనులు కల్పించాలని ఆర్డీవో ఉమాదే వి అధికారులకు సూచించారు.

కూలీలకు   ఉపాధి పనులు కల్పించాలి

పెబ్బేరు రూరల్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కల్పించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకొని పనులు కల్పించాలని ఆర్డీవో ఉమాదే వి అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి ప నులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో కనీసం రోజు వారిగా కూలీలు పనులకు వచ్చే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఉపాధి పథకంలో పండ్ల తోట ల పెంపకం కోసం దరఖాస్తులు చేసుకో వాల న్నారు. అదేవిధంగా పౌలి్ట్రఫార్మ్‌, క్యాటిల్‌ షెడ్‌, భూమి చదును చేయుట, రోడ్ల ఫార్మేషన్‌, ఇంకుడు గుంతల గుర్తించే పనులు చే పట్టాల న్నారు. కార్యక్రమంలో ఏపీడీ సుల్తాన్‌, ఎంపీడ ీవో రవీంద్ర, ఎంపీవో రోజారెడ్డి, ఏపీవో నరసి ంహారెడ్డి, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:18 PM