‘రైతు దీక్ష’కు తరలి రావాలి
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:23 PM
కోస్గి పట్టణంలో ఈనెల పదో తేదీన నిర్వహించనున్న రైతు దీక్షకు రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

- కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కొత్తపల్లి/కోస్గి/ ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కోస్గి పట్టణంలో ఈనెల పదో తేదీన నిర్వహించనున్న రైతు దీక్షకు రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కొత్తపల్లి మండలంలోని నిడ్జింత గ్రామంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, మహిళలకు రూ.2,500 అమలు చేయలేదని గుర్తు చేశారు. సోమవా రం నిర్వహించనున్న రైతు దీక్షకు కేటీఆర్ రానున్నారని, ప్రతీ గ్రామం నుంచి 200 మంది దాకా రైతులు తరలిరావాలని కోరారు. నాయకులు సలీం, వీరారెడ్డి, పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, రాంరెడ్డి, బి.నరేందర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా, కోస్గిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ, వెంకట్‌నర్సిములు, సాయప్ప, సలీం ఉన్నారు.