Share News

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:34 PM

స్వామి వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆన్నారు.

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలి
క్యాంప్‌ కార్యాలయం వద్ద వివేకానంద చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల న్యూటౌన్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానందుని స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జా తీయ యువజన దినోత్సవం సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్‌ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, జంబు రామన్‌గౌడ, వేణుగోపాల్‌, సత్యంరెడ్డి, విక్రమ్‌సింహారెడ్డి, ము నిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌ ఉన్నారు.

గద్వాల టౌన్‌: స్వామి వివేకానంద యువ తకు స్ఫూర్తి అని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. ఆదివారం జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌మార్గ్‌లోని వివేకా నం దుని విగ్రహానికి మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశ వ్‌, నాయకులతో పాటు నివాళులర్పించారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇసాక్‌, మధుసూదన్‌బాబు, కృష్ణారెడ్డి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, కౌన్సిలర్లు నాగరా జు, మహేష్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:35 PM