Share News

ఇచ్చిన మాట తప్పను

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:16 PM

అమ్మవారి ఆలయ అభివృద్ధి విషయంలో తాను ఇచ్చిన మాట తప్పబోనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు.

ఇచ్చిన మాట తప్పను
ఎద్దుల బండిపై ఆలయానికి వస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

- అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

- ఘనంగా శకటోత్సవం

నవాబ్‌పేట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : అమ్మవారి ఆలయ అభివృద్ధి విషయంలో తాను ఇచ్చిన మాట తప్పబోనని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. మండలంలోని పర్వతాపూర్‌ మైసమ్మ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన బోనాలు, శకటోత్సవం కార్యక్రమానికి ఆయన సోదరుడు దుశ్యంత్‌రెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే అత్యంత ఆదరణ కలిగిన మైసమ్మ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల వసతుల కోసం అతిథి గృహాలకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనుమతులు వస్తే త్వరలో నిధులు మంజూరు చేసుకుని పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తాను గతంలో పాదయాత్ర సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి యాత్ర ప్రారంభించానని తాను అనుకున్న పనులు జరిగాయన్నారు. అనంతరం అమ్మవారికి నిర్వహించే శకటోత్సవంలో భాగంగా కార్యకర్తల అభిష్టం మేరకు ఎద్దుల బండ్ల ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు భక్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నీరటి రాంచంద్రయ్య, మార్కెట్‌ చైర్మన్‌ హరిలింగం, వైస్‌ చైర్మన్‌ తులసీరాం, నవాజ్‌రెడ్డి, నాయకులు రఘువీర్‌ వర్మ, వాసు యాదవ్‌, రాజు, నారాయణరెడ్డి, మైనోద్దిన్‌, బక్క బాలయ్య, సూరి, మాధవులు, ఆశన్న, వెంకటయ్య, ఉమ్మర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:16 PM