బండలాగుడు పోటీల విజేతలు వడ్డెమాన్, రేమట ఎద్దులు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:57 PM
మం డలంలోని వావిలాల గ్రామంలో నిర్వహిం చిన ఎద్దుల బండలాగుడు పోటీల్లో వడ్డెమాన్, రేమ ట గ్రామాలకు చెందిన ఎద్దులు విజేతలుగా నిలిచాయి.

- అట్టహాసంగా పోటీల నిర్వహణ
- తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి పాల్గొన్న వృషభరాజములు
ఇటిక్యాల జనవరి (ఆంధ్రజ్యోతి) 17: మం డలంలోని వావిలాల గ్రామంలో నిర్వహిం చిన ఎద్దుల బండలాగుడు పోటీల్లో వడ్డెమాన్, రేమ ట గ్రామాలకు చెందిన ఎద్దులు విజేతలుగా నిలిచాయి. గ్రామంలో జరుగుతున్న శివాంజనేయస్వామి జాతరలో శుక్రవారం న్యూకేటగిరిలో పది జతలు పోటీలో పాల్గొన్నాయి. వడ్డెమాన్ సుధాకర్‌రెడ్డి, రేమట చిన్న గిడ్డయ్య ఎద్దులు మొదటి స్థానంలో నిలిచి రూ.50వేలు గెలుపొం దాయి. అలాగే మంగంపేట జయమ్మవీరాంజనేయులు ఎద్దులు రెండో బహుమతిగా రూ.40వేలు, శనిగపల్లి చక్రవర్తిగౌడ్ ఎద్దులురూ.30వేలను మూడవ బహుమతిగా, పచ్చర్ల సతీష్‌కుమార్‌రెడ్డి ఎద్దులు నాల్గవ స్థానంలో నిలిచి రూ.20వేలు గెలుపొందాయి. ఆలయ కమిటీ సభ్యులు వాటి యజమానులకు నగదుతో పాటు మెమెంటోలు అందజేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి పోటీలో పాల్గొన్నారు.