పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:03 PM
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏ.తిరుపతిరెడ్డి అన్నారు.

- కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
- మద్దూర్, కోస్గి మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ
మద్దూర్/కొత్తపల్లి/కోస్గి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏ.తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూర్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో ఆయన కాడా అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నివర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తహసీల్దార్ మహేశ్‌గౌడ్, ఎంపీడీవో నర్సింహారెడ్డి, ఎంపీవో రామన్న, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సంజీవ్, నాయకులు పాల్గొన్నారు.
అదేవిధంగా, కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చె క్కులను తిరుపతిరెడ్డి పంపిణీ చేశారు. తహసీల్దార్ జయరాములు, కాడా అధికారి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల మహేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, నిడ్జింత విజయ్‌కుమార్, మున్నూరు చెన్నప్ప, శ్రీనివాస్‌యాదవ్, ఎస్.శ్రీనివాస్ తదితరులున్నారు.
కోస్గి ఎంపీడీవో కార్యాలయంలో కోస్గి మండల, గుండుమాల్ మండల కార్యాలయంలో గుండుమాల్ మండల లబ్ధిదారులకు తిరుపతి రెడ్డి కాడా అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, మునిసిపల్ అధ్యక్షుడు బెజ్జురాములు, మార్కెట్ వైస్ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.
బ్రిడ్జి నిర్మాణం కోసం భూమిపూజ
కొత్తపల్లి : మండలంలోని మన్నాపూర్ నుంచి అల్లీపూర్ మధ్య రహదారిలో బ్రిడ్జి నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి శుక్రవారం భూమి పూజ చే శారు. మన్నాపూర్-అల్లీపూర్ మధ్యలో వాగు రావడంతో వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడేవారు. గమనించిన తిరుపతిరెడ్డి బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.8 కోట్లు మంజూరు చేయించారు.