మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:21 PM
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.

పాలమూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం దివిటిపల్లిలో నూతనంగా ఏర్పడిన ప్రాథమిక మత్స్య సహకార సంఘం రిజిస్ట్రేషన్ పత్రాలను మత్స్యకారులకు ఎమ్మెల్యే అందజేసి, మాట్లాడారు. ముడా నిధులతో ముదిరాజు కమ్యూనిటీ భవన నిర్మాణానికి సహకారం అంద జేస్తామన్నారు. మహిళలే కాదు.. పురుషులు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదగ వచ్చని ముదిరాజులు నిరూపించారని తెలిపారు. ముదిరాజుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొ దుపు సంఘాన్ని ప్రొత్సహించేందుకు రూ.లక్ష విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మత్య్సకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గంజి ఆంజనేయులు, మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, అనుప ఆంజనేయులు, చంద్రశేఖర్, సిరిగిరి మురళీధర్, కోస్గి శివప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
వినికిడి యంత్రాలు పంపిణీ
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) : జనరల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రోగులకు వినికిడి యం త్రాలను బుధవారం ఎమ్మెల్యే యొన్నం శ్రీనివా స్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈఎన్‌టీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని మొదటి విడతో 8 మందికి యంత్రాలు పంపిణీ చేశారు. వీటిని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డా.ద్వారకనాథ్‌రెడ్డి దానం చేశారు. జనరల్ ఆసుపత్రి సూపరింటెం డెంట్ డా.సంపత్‌కుమార్ సింగ్, ఆడియోమెట్రి టెక్నీషియన్ సతీష్, హెచ్‌డీఎస్ సభ్యుడు రాఘవేందర్ పాల్గొన్నారు.
ఆలయాలను అభివృద్ధి చేసుకుందాం
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పురాతన ఆలయాను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం టీడీగుట్టలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో నిర్మించిన షెడ్, స్టేర్‌కెర్‌ను ప్రారంభించి, మాట్లాడారు.