బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి
ABN , First Publish Date - 2025-05-28T23:05:20+05:30 IST
బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి అని ఎంపీ డీకే అరుణ కొనియాడారు.
- ఎంపీ డీకే అరుణ
- తెలుగు భాషా వికాసానికి కృషి : ఎమ్మెల్యే యెన్నం
పాలమూరు, మే 28 (ఆంధ్రజ్యోతి) : బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి అని ఎంపీ డీకే అరుణ కొనియాడారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్ట్ ఏరియాలో పాలమూరు రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సురవరం ప్రతాపరెడ్డి జయంతిలో ఆమె పాల్గొని నివాళి అర్పించారు. పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, క్రియాశీల ఉద్యమకారుడిగా తెలుగు భాషా వికాసానికి సురవరం ప్రతాపరెడ్డి విశేష కృషి చేశారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో 348 కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో ప్రచురించి తెలంగాణ ఖ్యాతిని చాటిన మహనీయుడు సురవరం అన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఏపీ మిథున్‌రెడ్డి, మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, రవికిషన్‌రెడ్డి, వినోద్‌కుమార్, రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకట్రామరెడ్డి, సురేందర్‌రెడ్డి, కోటేశ్వరరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గోపికాంత్‌రెడ్డి, సరస్వతి, వరలక్ష్మి, స్వరూప, శోభ, కవిత పాల్గొన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : మహబూబ్‌నగర్ అభివృద్ధిలో సీనియర్ సిటిజన్లు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పి లుపునిచ్చారు. పట్టణంలోని మె ట్టుగడ్డ వద్ద రూ.10 లక్షల జనరల్ ఫండ్ నిధులతో నిర్మించనున్న సీనియర్ సిటిజన్స్ సమావేశ మందిరానికి బుధవారం ఆయన భూమి పూజ చేసి, మాట్లాడారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్ల ఒక క్లస్టర్‌గా భవిష్యత్‌లో అద్భుత నగరంగా ట్రై సిటీగా తయారు చేస్తామన్నారు. ఇందుకోసం సీనియర్స్ సిటిజన్స్ అనుభవం వెలకట్టలేనిదని, మీ ఆలోచనలు, అనుభవాలతో మహబూబ్‌నగర్‌ను సుందర నగరంగా రూపొందించుకుందామన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, సీజె బెనహర్, అవేజ్, ఆంజనే యులు, రమేష్‌యాదవ్, సుధాకర్‌రెడ్డి, వెంకటేష్, శ్రీనివాసులు, అహ్మద్ పాల్గొన్నారు.