Share News

కాంగ్రెస్‌ అసలు రూపం బయట పడింది

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:17 PM

ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అసలు రూపం బయట పడిందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు.

కాంగ్రెస్‌ అసలు రూపం బయట పడింది
జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా

భూత్పూర్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అసలు రూపం బయట పడిందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం భూత్పూర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు మురళిధర్‌ గౌడ్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక పోయిందని ధ్వజమెత్తారు. అంతకుముందు భూత్పూర్‌ సమీపంలో ఓ రైతు పొలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను సమాధి చేశారు. మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్‌, రైతు సమితి మాజీ మండలాధ్యక్షుడు పాల నర్సిములు, పట్టణ అధ్యక్షుడు సురేష్‌కుమార్‌గౌడ్‌, మాజీ సర్పంచులు ఆంజనేయులు, ఫసీయోద్ధిన్‌, రామునాయక్‌, వెంకట్రాములు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:17 PM