లక్ష్యం చేరుకోవాలి
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:37 PM
ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకంలోని 16 రకాల యూనిట్ల మంజూరు చేసి వందశాతం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.

ఇందిరా మహిళా శక్తి పథకం సమీక్షలో కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకంలోని 16 రకాల యూనిట్ల మంజూరు చేసి వందశాతం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మహిళా శక్తి పథకం యూనిట్ల లక్ష్యం, బ్యాంకు లింకేజీ రుణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. యూనిట్ల గ్రౌండింగ్ 100 శాతం పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరుల లోపు ఇంది రా మహిళా శక్తి పథకం లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. సమావే శంలో డీఆర్‌డీవో ఉమాదేవి, డీపీఎం భాషా నాయక్, ఏఎల్డీఎం సాయి తదితరులు పాల్గొన్నారు.