Share News

మద్దతు ధరల గ్యారెంటీ చట్టం అమలు చేయాలి

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:17 PM

The Support Price Guarantee Act should be implemented కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను అమలు చేసి, మద్దతు ధరల గ్యారెంటి చట్టం చేయాలని అభిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యదగిరి డిమాండ్‌ చేశారు.

మద్దతు ధరల గ్యారెంటీ చట్టం అమలు చేయాలి
మాట్లాడుతున్న ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి

- ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి

నారాయణపేట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను అమలు చేసి, మద్దతు ధరల గ్యారెంటి చట్టం చేయాలని అభిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యదగిరి డిమాండ్‌ చేశారు. ఈ నెల 9న డిమాండ్‌డే గా నిర్వ హించాలని మంగళవారం స్థానిక భగత్‌సింగ్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో పేదరికం పెరిగిపోతుందని, వ్యవసా యంపై ఆధారపడి గ్రామీణ ప్రాంత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్రం లో రెండు లక్షల రుణమాఫీ మిగిలిపోయిన 16 లక్షల మందికి చేయాలన్నారు. రైతు భరోసా రూ.15వేలు జమ చేయాలని, కొడంగల్‌-పేట ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారం భించాలన్నారు. సమావేశంలో భగవంతు, వెంక ట్‌రెడ్డి, చెన్నారెడ్డి, కృష్ణ, కొండ నర్సింహులు, నారాయణ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణ: మండలంలోని ఖాన్‌దొడ్డిలో ఏఐయూ కేఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద్‌ ఆధ్వర్యంలో ఇండియా డిమాండ్‌ డే వాల్‌ పోస్టర్‌ను మంగ ళవారం విడుదల చేశారు. రూ.రెండు లక్షల రుణమాఫీ చేయకుండా హామీల్లో కోతలు విఽధించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు నూకలి తిప్పాయి, తాయప్ప, శివప్ప, మైబు, మహదేవ్‌, పంచాయతీ కార్మికు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:17 PM