Share News

శివాజీ స్ఫూర్తిని గుండెల్లో నింపుకోవాలి

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:37 PM

శివాజీ విగ్రహాలను పెట్టుకోవడం కాదని, ప్రతీ ఒక్కరు ఆయన పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని పని చేయాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహావిష్కరణ సభకు ఆమె విశిష్ఠ అతిథిగా హాజరై మాట్లాడారు.

శివాజీ స్ఫూర్తిని గుండెల్లో నింపుకోవాలి
శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, తదితరులు

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డీకే అరుణ

ఊట్కూర్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : శివాజీ విగ్రహాలను పెట్టుకోవడం కాదని, ప్రతీ ఒక్కరు ఆయన పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని పని చేయాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహావిష్కరణ సభకు ఆమె విశిష్ఠ అతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ సామ్రాజ్య స్థాపనలో వీర శివాజీ చేసిన పోరాటం అనిర్వచనీయమని అన్నారు. భారత దేశ రక్షణలో శివాజీ పోరాట స్పూర్తిని యువకులు కులాలకు అతీతంగా అలవర్చు కోవాల్సిన అవసరం ఉంది. అంతకు ముందు అఖిల భారత సహ ధర్మజాగరణ ప్రముఖ్‌ ఆలే శ్యామ్‌ కుమార్‌ జీ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులు, విధ్వంసం భవిష్యత్తులో మన దేశంలో జరగకూడదంటే మనం శివాజీలా తయారు కావల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, అఖిల భారత సామాజిక సమరసత ప్రముఖ్‌ అప్పల ప్రపాద్‌జీ, స్వామి ఆదిపరాశ్రీ, శక్తి పీఠం శాంతనంద పురోహిత్‌, నేరెడగం సిద్దలింగ మహాస్వామి, సామాజిక సమరసత పాలమూర్‌ విభాగ్‌ ప్రముఖ్‌ దుంప నర్పింగప్ప మాట్లాడారు. అంతకు ముందు శివాజీ మహారాజ్‌ విగ్రహాన్ని పెద్దలందరూ కలిసి ఆవిష్కరించారు. శ్యామ్‌కుమార్‌ జీ జెండాను విష్కరణ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కెంచె శ్రీనివాస్‌, కార్యదర్శి భాస్కర్‌ రాష్ట్ర నాయకులు రతంగ్‌పాండ్‌రెడ్డి కొండయ్య, నాగురావు నామోజీ, బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, నరసింహారెడ్డి, రఘువీర్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు జలందర్‌రెడ్డి, బాలకిష్టరెడ్డి, లక్ష్మారెడ్డి, రవికుమార్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు తిరుపతిగౌడ్‌, అనిల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:37 PM