Share News

అధికారుల పనితీరు మెరుగుపర్చుకోవాలి

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:07 PM

వార్డు ఆఫీసర్లు తమ పనితీరు మెరుగుపర్చు కోవాలని, వార్డుల్లో పర్యటించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని, ఇంటి పన్నులు పూర్తి స్థాయిలో రాబట్టాలని మునిసిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు అన్నారు.

అధికారుల పనితీరు మెరుగుపర్చుకోవాలి
పేట మునిసిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న కమిషనర్‌ భోగేశ్వర్లు

- వార్డుల్లో పర్యటించి ఇంటి పన్నులు రాబట్టాలి

- మార్చి వరకు సిబ్బందికి సెలవులు ఉండవు

- మునిసిపల్‌ సిబ్బంది సమీక్షలో కమిషనర్‌ భోగేశ్వర్లు

నారాయణపేట, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వార్డు ఆఫీసర్లు తమ పనితీరు మెరుగుపర్చు కోవాలని, వార్డుల్లో పర్యటించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని, ఇంటి పన్నులు పూర్తి స్థాయిలో రాబట్టాలని మునిసిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు అన్నారు. శుక్రవారం పేట మునిసిపల్‌ కార్యాలయంలో సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదటి సమావేశం కావడంతో సిబ్బంది పరిచయం చేసుకున్నారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ అధికారులు వార్డుల్లో పర్యటించాలని, రోడ్లు, డ్రైనేజీలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి వరకు సిబ్బంది ఎవరికీ సెలవులు ఉండవని స్పష్టం చేశారు. సిబ్బంది సమయపాలన పాటించి బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి సిబ్బంది కృషి చేయా లన్నారు. సమావేశంలో మేనేజర్‌ మల్లికార్జున్‌, ఇంజనీర్‌ మహేష్‌, అకౌంటెంట్‌ తిరుమలేష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ చెన్నకేశవులు, శ్రీనివాస్‌, ఎన్వరాల్‌మెంట్‌ ఇంజనీర్‌ భరత్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రహిమాన్‌, జవాన్లు నరేష్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 11:07 PM