పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:19 PM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి అన్నారు.

- డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి
నారాయణపేటటౌన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో శుక్రవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, క్యాన్సర్ రోగులకు సంబంధించి ప్రతీ పీహెచ్‌సీలలో ఓపీ చూసేటప్పుడు ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్‌ని గుర్తించాలన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లు ఎలా వ్యాపిస్తాయో వివరించారు. డా.సాయిరాం మాట్లాడుతూ శిశువులకు వేసే ప్రతీ టీకాల సంఖ్యను ఎంసీహెచ్, పీహెచ్‌సీలలో రిజిస్టర్‌లో రాసి ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో గోవిందరాజు, ఎంపీహెచ్‌ఈవో శ్రీనివాసులు, ఇన్‌చార్జి డెమో రాఘవేందర్, డీడీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.