పేదల సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:19 PM
నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.

- జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల, రాజాపూర్ బాలానగర్ మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం మల్లెబోయిన్‌పల్లి, రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ, బాలానగర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందన్నారు. బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రాజేందర్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు బుర్ల వెంకటయ్య, బుర్ల పద్మమ్మ, నిత్యానందం, యాదయ్య, అశోక్‌యాదవ్ పాల్గొనగా, రాజాపూర్‌లో కృష్ణయ్య, గోవర్ధన్‌రెడ్డి, రాఘవేందర్ నాయక్, రాములు గౌడ్, ఎంపీడీవో మచ్చేందర్, ఎంపీవో వెంకట్‌రాములు, బాలానగర్‌లో తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో విజయకుమారి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ అశ్విని పాల్గొన్నారు.
మిడ్జిల్ : మండలంలోని మున్ననూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బండారి వెంకటయ్య కుమార్తె ప్రతానం కార్యక్రమానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌రెడ్డి హాజరై నూతన వధువును ఆశీర్వదించారు.