దేశ భవిష్యత్ ఓటర్ల చేతిలో ఉంది
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:37 PM
దేశ భవిష్యత్ ఓటర్ల చేతిలో ఉందని.. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట టౌన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్ ఓటర్ల చేతిలో ఉందని.. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం పేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు పాఠశాలల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీనుద్ధేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో సమర్థవంతమైన నాయకుడిని ఎన్ను కునేందుకు ఓటు హక్కు ఎంతో దోహదపడుతుందన్నారు. పట్టణాల్లో ఓటరు నమోదు శాతం క్రమంగా తగ్గుతోందన్నారు. ఓటరు వినియోగాన్ని పెంచాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. అనంతరం ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందించారు. అలాగే 90 ఏళ్ల వ యస్సు పైబడిన సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్‌రావు, డీఎస్పీ లింగయ్య, జడ్పీ డిప్యూటీ సీఈవో జ్యోతి, డీఆర్ డీవో మొగులప్ప, డీఈవో గోవిందరాజులు ఉన్నారు.